ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులతో పరీక్షల(పరీక్షా పే చర్చ 2024) గురించి చర్చించారు. పరీక్షల టెన్షన్‌ను తొలగించేందుకు విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రధాన మంత్రి అనేక ఉదాహరణలు ఇవ్వడం ద్వారా పిల్లలను ప్రేరేపించారు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Pariksha Pe Charcha: పిల్లల రిపోర్ట్ కార్డ్స్‌ని తమ సొంత విజిటింగ్ కార్డుగా పరిగణించొద్దని ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థుల తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ కోసం దరఖాస్తులను త్వరలోనే ఆహ్వనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రెండు గంటల పాటు ప్రధాని మోడీ చర్చించనున్నారు.
పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్.. 2023లో కూడా జరగనుంది.