Pakistan: ఇస్లామాబాద్‌లో సైరన్ చప్పుళ్లు.. లాహోర్ విడిచిపెట్టాలని యూఎస్ ఆదేశాలు..
- పాకిస్తాన్ వ్యాప్తంగా గందరగోళం..
- భారత దాడులతో ఉక్కిరిబిక్కిరి..
- ఇస్లామాబాద్‌లో సైరన్ చప్పుళ్లు..
- లాహోర్ విడిచి వెళ్లాలని యూఎస్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది. దీనిని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకుని దాయాది దాడిని భగ్నం చేసింది. మరోవైపు, కౌంటర్ అటాక్‌గా భారత్, లాహోర్‌లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని సర్వనాశనం చేసింది. గురువారం ఉదయం లాహోర్ కంటోన్మెంట్‌కి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయిల్ తయారీ హార్పి డ్రోన్స్ పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని నాశనం చేశాయి.
Read Also: S-400 Sudarshan Chakra: భారత్‌ని రక్షించిన “S-400 సుదర్శన చక్ర”.. పాక్ క్షిపణి దాడి భగ్నం..
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియక లాహోర్, కరాచీ, సియాల్‌కోట్ ఎయిర్ పోర్టుల్ని మూసేసింది. మరోవైపు, రాజధాని ఇస్లామాబాద్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే, లాహోర్‌ని వెంటనే విడిచి వెళ్లాలని అమెరికా తన ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడులు ఇందుకు కారణమని తెలుస్తోంది. లాహోర్ ప్రధాన ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ప్రజల్ని పాక్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారనే సమాచారం కూడా పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అందింది. లాహోర్‌లో ఉన్న అమెరికన్లు వెంటనే నగరాన్ని విడిచివెళ్లాలని, సాధ్యం కాకపోతే షెల్టర్ లో ఉండాలని ఆదేశించింది.
🚨 Sirens go off in Islamabad. pic.twitter.com/HZJWlVei8A
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 8, 2025
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!