Pakistan PM: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి డ్రాగన్ కంట్రీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మోడీతో పుతిన్, జిన్‌పింగ్ దైపాక్షిక చర్చలు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేసింది. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, భారత్, చైనాల మధ్య స్నేహ బంధం బలపడుతోంది. దీంతో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ భేటీని కూడా అంతర్జాతీయ మీడియా హైలెట్ చేసింది.
ఇదిలా ఉంటే, ఈ మొత్తం సమావేశంలో ఆటలో అరటిపండులా తయారైంది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యవహారం. చైనా మాకు ఆప్తమిత్రుడని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్, ఆ దేశ ప్రధాని వెళ్తే చైనా అధ్యక్షుడి షి జిన్ పింగ్‌తో పాటు ఇతర దేశాధినేతలు ఎవరూ పట్టించుకోనే లేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌పై ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు.
Read Also: Never Ducked In ODIs: వన్డే కెరీర్‌లో ఎప్పుడూ డకౌట్ కానీ ఆ నలుగురు.. లిస్ట్‌లో మనోడు కూడా ఉన్నాడు!
ఇతర నాయకులు ప్రశాంతంగా ఉండగా, పుతిన్ వెళ్తుండగా అటెన్షన్ షరీఫ్ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి తనను గుర్తించాలని తాపత్రాయ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘ SCO సమ్మిట్‌లో పాకిస్తాన్ ప్రధానిని జిన్‌పింగ్ స్వయంగా అవమానించారు’’ అని మరోకరు కామెంట్ చేశారు.
మరో వీడియోలో ప్రధాని మోడీ, పుతిన్ కలిసి నడుస్తుండగా బుద్ధిగా ఒక నిలుచుని, దిగాలు ముఖంతో షెహబాజ్ షరీఫ్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘‘ ఆ క్షణం ఖచ్చితంగా బాధిస్తుంది. కొన్ని సార్లు చరిత్ర మీ ముందు సృష్టించబడుతున్నప్పుడు కేవలం ప్రేక్షకుడిగా మాత్రమే ఉంటారు’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘అతను (షరీఫ్) స్కూల్ పిల్లాడిలా నిశ్శబ్దంగా, శ్రద్ధగా నిలబడి ఉన్నాడు’’ అని రాశారు. మరొకరు ‘‘ అతను ఇంకా ఎన్ని రోజులు ప్రధానిగా ఉంటాడో అని ఆలోచిస్తున్నాడు’’ అని కామెంట్ చేశారు.
Narendra Modi ji and Putin ignored Shahbaz Sharif like he never existed pic.twitter.com/3yJorJhvo1
— Vishal (@VishalMalvi_) September 1, 2025
While other leaders showed composure, Pakistan PM Shehabaz Sharif came running to Putin to shake his hand…. pathetic attention seeking behaviour.
Xi Jinping realised what Shehbaz was going to do, so he looked the other way and ignored him 😭 pic.twitter.com/NAEeDw2oyY
— Incognito (@Incognito_qfs) August 31, 2025