Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు…
Imran Vs Asim: ఒక్క సంతకం... కేవలం ఒకే ఒక్క సంతకం... ఒక దేశ చరిత్రను, ఒక శక్తివంతమైన నాయకుడి తలరాతను ఎలా మార్చేస్తుందో తెలుసా? 2019లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం, ఇప్పుడు 2025లో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లోని అడియాలా జైలు గోడల వెనుక అసలేం జరుగుతోంది?,
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ లక్ష్యం ఏమిటంటే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ పదవీకాలం, చట్టపరమైన హోదా చుట్టూ ఉన్న అస్పష్టతను తొలగించడం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించిన విషయం తెలిసిందే. అయితే మునీర్ ఈ పదవి నుంచి అధికారికంగా నవంబర్ 28, 2025న…
Pakistan: పాకిస్థాన్‌లో బాంబులు పేలడం కొత్తకాదు. కానీ ఈ సారి నిజంగానే కొత్త రకం బాంబు పేలి దేశంలో సంచలనం రేపింది. ఇంతకీ ఆ బాంబు ఏంటని ఆలోచిస్తున్నారా.. మీకు ఇమ్రాన్ ఖాన్ గుర్తుకు ఉన్నారా.. ఆయన పాక్ తరుఫున క్రికెట్ ఆడి సంచలనాలు సృష్టించారు. తర్వాత ఆయన దేశంలో పీటీఐ అనే పార్టీ పెట్టి రాజకీయాలను కూడా ఒక ఆట ఆడుకున్నారు. పాపం ఎక్కడ చెడిందో ఏమో గానీ ఆ దేశ సైన్యానికి ఇమ్రాన్‌కు గట్టిగా…
Pakistan PM: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి డ్రాగన్ కంట్రీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మోడీతో పుతిన్, జిన్‌పింగ్ దైపాక్షిక చర్చలు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేసింది. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, భారత్, చైనాల మధ్య స్నేహ బంధం బలపడుతోంది. దీంతో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ భేటీని కూడా అంతర్జాతీయ మీడియా హైలెట్ చేసింది.
Pakistan: పాకిస్తాన్లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం పడుతుందని అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, సింధ్ ప్రావిన్సు గుండా ప్రయాణిస్తున్న సమయంలో కోహిస్తానీపై దాడి జరిగింది.
పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వందకు పైగా కేసుల్లో ఇరుక్కోవడం తెలిసిన విషయమే. కొన్ని రోజుల క్రితం ఆయన అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పాల్పడ్డారు
Former Pakistan PM Imran khan booked under terror act: పాకిస్తాన్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై అక్రమ నిధుల కేసు నమోదు చేసిన పాక్ ఏజెన్సీలు, తాజాగా ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ త్వరలో జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయ, చట్టాల అధికారులపై విమర్శలు చేసినందుకు,…