FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FSSAI Action on Nestle: శిశు పోషణ, పసిపిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతటి ప్రముఖ సంస్థకైనా చిక్కులు తప్పవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ‘నెస్లే ఇండియా’కు షాక్ ఇచ్చింది. నెస్లే తయారుచేసే మూడు రకాల పసిపిల్లల న్యూట్రిషన్ ఉత్పత్తులపై నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో లీగల్ నోటీసులు జారీ చేసి, లీగల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై విచారణ ప్రారంభమైంది.
అసలు ఏం జరిగిందంటే..?
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో నెస్లే ప్రమోట్ చేసుకుంటున్న ప్రచార ప్రకటనలు, ఉత్పత్తుల నాణ్యతను FSSAI నిశితంగా పరిశీలించింది. ఇందులో ప్రధానంగా ‘నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1’ (NAN Excella Pro Stage 1) ప్రచారంలో “5 HMOs”, “వే ప్రోటీన్” వంటి విశేషాలు ఉన్నట్లు నెస్లే క్లెయిమ్ చేసింది. అలాగే ‘లాక్టోజెన్ ప్రో 1’ (Lactogen Pro 1) విషయంలోనూ అందులోని ‘వే ప్రోటీన్’ త్వరగా అరుగుతుందని ప్రచారం చేశారు. దీనిపై FSSAI వివరణ కోరగా, నెస్లే ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. చిన్నపిల్లల ఆహార అమ్మకాలను పెంచుకోవడానికి ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చేయడం ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2020’ నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
శిశువుల ఆహారం విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉంటారంటే..?
పసిపిల్లల ఎదుగుదలలో ఆహారం అత్యంత చాలాకమైనది. మార్కెటింగ్ జిమ్మిక్కులు చూసి తల్లిదండ్రులు తప్పుదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే భారత్‌లో కఠిన చట్టాలు ఉన్నాయి. 1992 నాటి ‘ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ యాక్ట్’ ప్రకారం శిశు ఆహారాల ప్రకటనలు, ప్రచారాలపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. వ్యాపార ప్రకటనలు తల్లిదండ్రుల నిర్ణయాలను ప్రభావితం చేయకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఇక, కేవలం ప్రచార ఆర్భాటాలే కాకుండా, పోషకాల పరిమాణంలోనూ ఒక ఉత్పత్తి విఫలమైంది. నెస్లే తయారుచేసిన ఒక ఫాలో-అప్ ఫార్ములా (Follow-up Formula) శాంపిల్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా, అందులో ఉండాల్సిన ‘బయోటిన్’ (విటమిన్ B7) ప్రమాణాలు తగ్గట్లుగా లేవు. అనుమానంతో దీన్ని రెఫరల్ ల్యాబొరేటరీకి పంపగా, అక్కడ కూడా అదే విషయం నిర్ధారణ అయింది. పసిపిల్లల శరీర విధులకు విటమిన్ B7 చాలా అవసరం. నిబంధనల ప్రకారం నిర్దేశించిన మోతాదు లేకపోవడంతో దీన్ని ‘సబ్‌స్టాండర్డ్’ (ప్రమాణాలకు సరిపోనిది)గా పరిగణించారు. మొత్తంగా నెస్లే ఇండియాపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ప్రచార ఆరోపణలపై రెండు, పోషకాల లోపంపై ఒక కేసు ఉన్నాయి. సంబంధిత ప్రాధికార సంస్థ విచారణ పూర్తయిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం రానుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!