SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్రంలో ఐటీ, క్వాంటం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని విస్తరించడానికి ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రూ. 526.25 కోట్ల పెట్టుబడులతో పాటు క్వాంటం రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,896 ఉద్యోగ అవకాశాలు కల్పించే 10 ప్రధాన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
విశాఖపట్నంలో డెలాయిట్ సంస్థ రూ. 43.75 కోట్ల పెట్టుబడితో 2,500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా, ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ. 100 కోట్ల పెట్టుబడితో 2,400 సీట్లతో ఇంటిగ్రేటెడ్ హబ్ ఏఐ అండ్ టెక్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే కడప జిల్లాలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ రూ. 70 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న యూనిట్‌కు ప్రోత్సాహకాల గడువును పొడిగించారు, తద్వారా 300 ఉద్యోగాలు రానున్నాయి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అమరావతిని క్వాంటం హబ్‌గా మార్చే లక్ష్యంతో పలు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. సృష్టి క్వాంటం ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2,700 కోట్ల భారీ పెట్టుబడితో క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్, నానోఫ్యాబ్రికేషన్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను ఏర్పాటు చేయనుండగా దీని ద్వారా 3,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి. క్వాంటం కోడాన్ సంస్థ రూ. 167 కోట్లతో బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ ద్వారా 1260 ఉద్యోగాలను, అరోహాక్ టెక్నాలజీస్ రూ. 62 కోట్లతో ఫోటోనిక్స్ క్వాంటం రీసెర్చ్ సెంటర్ ద్వారా 300 ఉద్యోగాలను అందించనున్నాయి.
అలాగే ట్రైక్వాంటా లాబ్స్ రూ. 35 కోట్లతో హైబ్రిడ్ క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్ తయారీ కేంద్రం (175 ఉద్యోగాలు), ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ రూ. 9 కోట్లతో ఫోటోనిక్ క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ తయారీ కేంద్రం (45 ఉద్యోగాలు), వెరిడేటా హెల్త్ రూ. 4.5 కోట్లతో క్లినికల్ ఆపరేటింగ్ సిస్టమ్ గ్లోబల్ ఇంజనీరింగ్ హబ్ (50 ఉద్యోగాలు) ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్రం టెక్నాలజీ , క్వాంటం రంగంలో గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందనుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!