TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- టీఎంసీ సంక్షోభం నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం..
- పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఫ్రీజ్..
- మమతా, రీటబ్రత వర్గాలకు కొత్త పేర్లు, గుర్తులు..
- ఉప ఎన్నికల్లో ఈ గుర్తులతోనే పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గపోరు కీలక మలుపు తీసుకుంది. పార్టీకి చెందిన అసలు పేరు, ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీ్ చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించింది. ఇక తిరుగుబాటు వర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్/కవర్’ గుర్తును ఇచ్చింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ గుర్తులపైనే పోటీ చేయబోతున్నారు.
దీనికి ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు మూడు దశాబ్ధాలుగా ఉన్న ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, దాని రెండు ఆకుల గుర్తును ఈసీ ఫ్రీజ్ చేసింది. దీంతో రెండు వర్గాలు ఈ పేరు, గుర్తు వాడకుండా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమతా వర్గం ఈసీ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని విమర్శించారు. మరోవైపు తిరుగుబాటు వర్గం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. తమకు ‘పువ్వులు-గడ్డి’ గుర్తే కావాలని, తుది నిర్ణయం తమకు పార్టీ పేరు, గుర్తును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత, తృణమూల్ రెండుగా విడిపోయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 58 మంది రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. వీరికి అసెంబ్లీ స్పీకర్ గుర్తింపు కూడా లభించింది. ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు. 20 మంది ఎంపీలు సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో NCPIలో చేరి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మద్దతు ప్రకటించారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?