KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KFC: ఆకలి వేస్తే కేఎఫ్‌సీ (KFC) వైపు చూడటం కామన్.. కానీ ప్రసవ వేదనతో విలవిలలాడుతున్న ఓ నిండు గర్భిణి కారు ఆ పార్కింగ్‌లోకి దూసుకొస్తే? ఆసుపత్రి బెడ్డుపై కాకుండా.. బకెట్ చికెన్ బోర్డు కిందే ఆ పసికందు పురుడు పోసుకుంటే? వినడానికే కొత్తగా ఉంది కదా ఈ సీన్. కానీ నిజంగా ఇది ఇంగ్లాండ్‌లో జరిగింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ డెలివరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్‌లోని బ్రోమ్స్‌గ్రోవ్ ప్రాంతానికి చెందిన కేటీ మర్ఫీ (33), స్టీఫెన్ కిర్బీ (32) దంపతులకు ఇది జీవితాంతం మర్చిపోలేని రోజు. కేటీకి పురిటి నొప్పులు రావడంతో మొదట ఆసుపత్రికి వెళ్లినప్పటికీ, ఇంకా సమయం ఉందని భావించిన వైద్యులు ఆమెను ఉదయమే ఇంటికి పంపించారు. అయితే సాయంత్రం అయ్యేసరికి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టీఫెన్ తన వైఫ్‌ని కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి పరుగు తీశాడు.
అయితే ట్రాఫిక్ కారణంగా ఆస్పత్రికి వెళ్లడానికి ఇంకో అరగంట ఎక్స్ట్రా టైం పట్టేలా ఉండటంతో కేటీ బాధ వర్ణనాతీతంగా మారింది. పరిస్థితి చూస్తుంటే ఆసుపత్రికి చేరడం అసాధ్యమని స్టీఫెన్‌కు అర్థమైపోయింది. రోడ్డు పక్కన కారు ఆపేందుకు సరైన చోటు లేకపోవడంతో, అతడికి రోడ్డు పక్కనే ఉన్న కేఎఫ్‌సీ రెస్టారెంట్ కనిపించింది. ఆలోచించేందుకు సమయం లేదు.. వెంటనే కారును కేఎఫ్‌సీ పార్కింగ్ ప్లేస్‌లోకి దూకించాడు. “మేము పార్కింగ్‌లోకి రాగానే బిడ్డ బయటకు వస్తున్నట్లు తెలిసింది” అని ఆ ఉద్విగ్న క్షణాలను గుర్తుచేసుకుంది కేటీ. స్టీఫెన్ కారు ఆపి, వెంటనే అంబులెన్స్‌కు లొకేషన్ వివరాలు చెబుతూనే మరోవైపు కారు డోర్ వద్దకు పరుగుతీశాడు. అంతే.. సరిగ్గా అదే క్షణంలో పసికందు బయటకు రావడంతో తండ్రి స్టీఫెన్ స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ అక్కడికి చేరుకుని తల్లీబిడ్డలను సురక్షితంగా ఆసుపత్రికి తరలించింది. ఆగస్టు 29న పుట్టిన ఆ బుడతడు ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
కొడుకుకి ముద్దుపేరు.. ‘కల్నల్ కోడీ’
ఈ చిన్నారికి ‘కోడీ’ అని పేరు పెట్టినప్పటికీ, పుట్టిన లొకేషన్ కారణంగా వాడికి ఓ క్రేజీ నిక్ నేమ్ వచ్చి చేరింది. కేఎఫ్‌సీ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లాండ్ సాండర్స్ గుర్తుగా, ఈ బాబుకు వాళ్ల తల్లిదండ్రులు ముద్దుగా “కల్నల్ కోడీ” అని పేరు పెట్టారు. జీవితాంతం వాడికి ఈ పేరే నిలిచిపోతుందని వారు నవ్వుతూ చెబుతున్నారు. ఈ విచిత్రమైన ఘటన గురించి విన్న ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోవడమే కాదు.. ఆ రాత్రి వార్డు మొత్తం కేఎఫ్‌సీ ఫుడ్తోనే సంబరాలు చేసుకున్నారట. అంతేకాదు, కోడీ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను కూడా అదే కేఎఫ్‌సీ సెంటర్లో గ్రాండ్‌గా చేయాలని, భవిష్యత్తులో వాడి ఫస్ట్ పార్ట్‌టైమ్ జాబ్ కూడా అక్కడే ఉండాలని ఆ తల్లిదండ్రులు సరదాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
కేఎఫ్‌సీ నుంచి బంపర్ గిఫ్ట్స్
తమ పార్కింగ్ ప్లేస్‌లో ఓ ప్రాణం పోసుకుందన్న వార్త కేఎఫ్‌సీ యాజమాన్యానికి చేరింది. వెంటనే స్పందించిన ఆ సంస్థ, కోడీ కుటుంబానికి మనస్ఫూర్తిగా విషెస్ తెలుపుతూ.. తమ బ్రాండ్ మర్చండైజ్ గిఫ్ట్‌లతో పాటు ప్రత్యేకమైన ఫుడ్ వోచర్లను కూడా గిఫ్ట్‌గా అందించింది. నార్మల్‌గా కేఎఫ్‌సీ చికెన్ కోసం వెళ్లే ఆ రెస్టారెంట్, ఇప్పుడు కోడీ కుటుంబానికి తరాలు దాటి చెప్పుకునే ఒక అపురూప జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!