Meat Shops Closed: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో మాంస విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. పర్యావరణ, జంతు సంక్షేమం, సాంప్రదాయ విలువల పరిరక్షణ పేరుతో అధికారాలు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దీనిపై మాంసం వ్యాపారులు, హోటల్ యజమానులు, పౌర సమాజంలోని విభిన్న వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో #MeatBan, #FoodFreedom వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. మాంస నిషేధం అనుకూల, ప్రతికూల వర్గాలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
Read Also: Harassment: మహిళకు ఎస్సై లైంగిక వేదింపులు.. వీడియో కాల్ లో బట్టలు విప్పి..
అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) తీసుకున్న ఆదేశాలను హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం), ఆగస్టు 16 (జన్మాష్టమి) తేదీల్లో మాంస దుకాణాలు, స్లాటర్‌హౌస్‌లు మూసివేయాలని చెప్పడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి, మాంసాహారానికి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో 99 శాతం మంది మాంసం తింటారు.. ఇలా నిషేధం విధించడం వల్ల ప్రజల స్వేచ్ఛ, గోప్యత, జీవనోపాధి, సంస్కృతి, ఆహార హక్కులు, మత స్వేచ్ఛలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ఓవైసీ రాసుకొచ్చారు.
Read Also: Maharashtra: 15న మాంసం అమ్మకాలపై నిషేధం.. తప్పుపట్టిన అజిత్ పవార్
మహారాష్ట్రలో మాంస నిషేధంపై వివాదం..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాంస నిషేధం విధించగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రోజు కోసం ప్రజలు భావోద్వేగాలను కించపర్చొద్దని సూచించారు. మహారాష్ట్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో ఇలా ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. థానే జిల్లా కల్యాణ్-డొంబివిలి మునిసిపల్ కార్పొరేషన్ కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేయగా.. శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే తీవ్రంగా మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఏం తినాలో నిర్ణయించడం ప్రజల హక్కు, స్వేచ్ఛను హరించినట్లు అవుతందన్నారు. మా ఇంట్లో నవరాత్రి సమయంలో కూడా ప్రసాదంలో రొయ్యలు, చేపలు ఉంటాయని గుర్తు చేశారు. ఇది మా సంప్రదాయం, మా హిందుత్వం అని ఆదిత్య ఠాక్రే వెల్లడించారు.
Read Also: MLA Nandamuri Balakrishna: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు శ్రీకారం..
అలాగే, ఈ మాంస నిషేధానికి మహారాష్ట్రలోని బీజేపీ-సేన-ఎన్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధి అరుణ్ సావంత్ తెలిపారు. ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తోందన్నారు. ఈ మాంస నిషేధం వివాదం, పండుగ రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, సాంప్రదాయాలు, ప్రభుత్వ ఆంక్షల పరిమితులపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చను రగిలించింది.
Many municipal corporations across India seemed to have ordered that slaughterhouses and meat shops should be closed on 15th August. Unfortunately, @GHMCOnline has also made a similar order. This is callous and unconstitutional.
What’s the connection between eating meat and…
— Asaduddin Owaisi (@asadowaisi) August 13, 2025
#WATCH | Mumbai: On Kalyan-Dombivli Municipal Corporation reportedly ordered the closure of all slaughterhouses and meat shops on August 15, Shiv Sena (UBT) MLA Aaditya Thackeray says, "In our house, even on Navratri, our prasad has prawns, fish, because this is our tradition,… pic.twitter.com/ivxVhjHw2i
— ANI (@ANI) August 12, 2025