పవర్ స్టార్ పవన్ నటిస్తున్న సినిమాలలో బ్రో కూడా ఒకటి.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ని పవన్ కళ్యాణ్ వాయువేగంతో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జులై 28న విడుదల కానుంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో ఏడాదికి ఒకటి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి.. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా సినిమా చెయ్యడం విశేషం..ఈ బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్. సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు..
దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తున్న ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోల కోసం ఒక ఐటమ్ ఉన్నట్లు సమాచారం..ఆ సాంగ్ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. హైదరాబాద్ లో ఓ పబ్ సెట్ ఏర్పాటు చేశారట. ఆ సెట్లో ఐటమ్ నంబర్ షూట్ చేయనున్నారట. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఐటెం సాంగ్ లో ఊర్వశి రాతెలా నటిస్తున్నారట..పవన్ కళ్యాణ్ తో ఆమె స్టెప్పులు వెయ్యనుందని ఇండస్ట్రీలో టాక్..ఈ అమ్మడు చిరుతో వాల్తేరు వీరయ్య మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్ లో ఆమె ఇరగదీశారు. ఊర్వశి నటించిన బాస్ పార్టీ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యింది..
ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వం లో తెరకేకుతున్న ఓ జీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు పూర్తి చేస్తున్నారు. హరి హర వీరమల్లు మాత్రం పక్కన పెట్టేశారు. హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడో ఇంత వరకు క్లారిటీ లేదు..మరికొద్ది రోజుల్లే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఫ్యాన్స్ కు జాతరే..