బాబోయ్.. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలొచ్చినా వారి భద్రతకు ముప్పు పొంచే ఉంది. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా కూడా మృగాళ్లు మరింత రెచ్చిపోయి ఘాతుకాలకు తెగబడుతున్నారు. బయటకెళ్తే రక్షణ లేదేమో అనుకోవచ్చు.. కానీ పట్టపగలు ఆస్పత్రిలోనే రక్షణ లేదు. అందరూ చూస్తుండగా ఒక యువతి గొంతు కోసి చంపుతుంటే చుట్టూ పదులకొద్దీ జనం ఉన్న కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. ప్రేక్షకుల్లా చూస్తూ వీడియోలు తీశారు. దుర్మార్గుడు.. యువతిని చంపేసి తాపీగా బయటకు వెళ్లి బైక్‌పై పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు..
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా ఆస్పత్రిలో 19 ఏళ్ల సంధ్య చౌదరి అనే విద్యార్థిని నర్సింగ్ ట్రైనింగ్ పొందుతోంది. ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్న సంధ్యపై అభిషేక్ కోష్టి అనే యువకుడు అమాంతంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతు కోస్తుంటే.. చుట్టూ జనం ఉన్న ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకుల్లా మొబైల్‌లో వీడియోలు తీశారు. నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు నటించినా.. అనంతరం ఆస్పత్రి బయటకు వెళ్లి బైకుపై పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Crime News Today: జగ్గయ్యపేటలో దారుణం.. కొడుకుని కడతేర్చిన తండ్రి!
అయితే సంధ్య-అభిషేక్ మధ్య స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత కాలం నుంచి సంధ్య యువకుడికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యువకుడు.. ఆమెపై పగ పెంచుకున్నాడు. జూన్ 27న ఘటన జరిగి ఉండగా తాజాగా వీడియో వైరల్ అవుతోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రెండేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశామని.. కస్టడీలో అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు.
నల్ల చొక్కా ధరించిన అభిషేక్, తెల్ల షర్ట్ వేసుకున్న సంధ్య రూమ్ నెంబర్ 22 వెలుపల మాట్లాడుకున్నారు. అనంతరం సంధ్యను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే నేలకేసి విసిరాడు. అటు తర్వాత ఆమె ఛాతీపై కూర్చుని గొంతు కోశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాపు ఈ ఘటన 10 నిమిషాల పాటు జరిగింది. విచిత్రమేంటంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారితో పాటు వార్డు బాయ్‌లు, వైద్యులు, నర్సులు కూడా ఉన్నారు. కానీ ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనతో ఆస్పత్రిలో రోగులు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు డిశ్చార్జ్ అయిపోయారు. భారీగా రక్తస్రావం కావడంతో సంధ్య అక్కడే చనిపోయింది. ఉదయం చనిపోతే.. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటి వరకు మృతదేహం అలానే ఉంచారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.