Arvind Kejriwal: కేజ్రీవాల్ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే కాకుండా..ఆయనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఆప్ ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్‌ని ఢిల్లీ లిక్కర్ కేసులో అక్టోబర్ 4న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన మూడో వ్యక్తి సంజయ్ సింగ్. అంతకుముందు ఢిల్లీ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్, ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వారు మాజీలుగా ఉన్నారు. మరోవైపు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు నవంబర్ 24 వరకు పొడగించింది. పార్లమెంట్ సభ్యుడిగా అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు న్యాయమూర్తి అనుమతించారు.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
Read Also: BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్‌గా యడియూరప్ప కుమారుడు..
ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు పంపింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రగా కేజ్రీవాల్ విమర్శించారు. అయితే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నిలక ముందు బీజేపీ విపక్షాల నేతల్ని ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈడీ ఈ కేసులో కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా చేయాలా..? లేక ప్రభుత్వాన్ని కొనసాగించాలా..? అనే దానిపై ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రిఫరెండం నిర్వహిస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. అయితే రెఫరెండానికి ఎలాంటి తేదీని ఖరారు చేయలేదు. ఈ కేసులో ఈడీతో పాటు సీబీఐ కూడా విచారిస్తోంది.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!