Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: టాలీవుడ్లో ఇటీవల వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ భామపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని, హీరోయిన్ కయాదు లోహర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కయాదు లోహర్ మాట్లాడుతూ.. తన అసలు పేరు, నేపథ్యం, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
తాజా ఇంటర్వ్యూలో కయాదు మాట్లాడుతూ..తన పేరు ‘కయాదు’ వెనుక ఉన్న పురాణ నేపథ్యాన్ని బయటపెట్టింది. “నా పేరు సాధారణమైనది కాదు.. హిందూ పురాణాల్లోని రాక్షస రాజు హిరణ్యకశిపుడి భార్య పేరు ‘కయాదు’. ప్రహ్లాదుడి తల్లి కూడా ఆమే. మా తల్లిదండ్రులు ఆ మైథలాజికల్ క్యారెక్టర్ స్ఫూర్తితోనే నాకు ఆ పేరు పెట్టారు” అని స్పష్టం చేసింది. అలాగే తన ఇంటిపేరు మార్పు వెనుక ఉన్న మరో ట్విస్ట్‌ను కూడా ఆమె వెల్లడించింది. “వాస్తవానికి నా అసలు ఇంటిపేరు ‘లోహర్’ కాదు.. మా పూర్వీకుల ఇంటిపేరు ‘గాడలి’. అంటే నా పూర్తి పేరు ‘కయాదు గాడలి’. కానీ మా నాన్నగారు పూణేకు మారిన సమయంలో ఏదో కారణం చేత మా ఇంటిపేరును ‘లోహర్’గా మార్చేశారు. అలా నేను ‘కయాదు లోహర్’గా మారిపోయాను. ఇప్పటికీ ఆ ఇంటి పేరు మార్పు ఎందుకు చేశారో నాకు పూర్తిగా తెలియదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేకపోవడంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నాను” అని నవ్వుతూ చెప్పింది. తన మూలాలు నేపాల్‌కి చెందినవైనప్పటికీ, తన కుటుంబం అస్సాం, పూణేల్లో స్థిరపడినట్లు కయాదు చెప్పుకొచ్చింది. ఒకవైపు విలక్షణమైన పౌరాణిక పేరు, మరోవైపు తండ్రి మార్చిన ఇంటిపేరు.. ఈ రెండింటి కాంబినేషన్‌తో ఇప్పుడు నెట్టింట కయాదు లోహర్ పేరు మార్మోగిపోతోంది. ఈ ఆసక్తికరమైన వివరాలు బయటకు రావడంతో నెటిజన్లు ఆమె కుటుంబ నేపథ్యంపై చర్చించుకుంటున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?