Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఇప్పుడు మరోసారి నెట్టింట సంచలనంగా మారారు. ఆయన కాలేజ్ ఈవెంట్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన తాను నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురించి ప్రస్తావించడంతో, అది ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. కాలేజ్ ఈవెంట్లో స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోహన్ బాబు మాట్లాడుతుండగా.. ఆయన ‘ప్యారడైజ్’ అనే పదాన్ని ప్రస్తావించగానే, సభలో ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఆ చప్పట్లన్నీ తాను నటించిన ‘ప్యారడైజ్’ సినిమా కోసమేనని గ్రహించిన మోహన్ బాబు, ఆ సినిమాలోని తన పాత్ర ఎంత భయంకరంగా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. “ఆ సినిమా చూస్తే నా దగ్గరకు కూడా రారు మీరు.. అంత భయంకరమైన క్యారెక్టర్ అది” అంటూ ఆయన నవ్వుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలతో, ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఆయన పాత్ర ఎంత తీవ్ర స్థాయిలో ఉండబోతోందో, అది ప్రేక్షకులను ఏ రేంజ్లో భయపెట్టబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్లుగా ఎన్నో పవర్ ఫుల్ పాత్రల్లో, అద్భుతమైన విలన్ గా మెప్పించిన మోహన్ బాబు, మళ్ళీ తన పాత క్యారెక్టర్స్‌ను మించేలా ఒక భయంకరమైన నెగెటివ్ రోల్ పోషిస్తున్నారని ఆయన మాటలతో స్పష్టమైంది. ఈ సినిమాతో ఆయన మళ్లీ వెండితెరపై తన విశ్వరూపం చూపించబోతున్నారన్న వార్తలు, అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!