Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లోని జముయిలో ఇటీవల జరిగిన ఓ దారుణమైన లైంగిక దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. యూనిఫాంలో ఉన్న ఒక పాఠశాల విద్యార్థి, విద్యార్థిని పట్ల కొందరు కుర్రాళ్ళు తీవ్రంగా బూతులు మాట్లాడుతూ, ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ (బ్యాడ్ టచ్ చేస్తూ) గొడవ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి ఆరా తీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధ్యులైన వారిని గుర్తించి, మొదట ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా మరో నలుగురు పరారయ్యారు.
ఈ పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా, జముయిలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నందన్ యాదవ్, మరో నిందితుడు హరే రామ్‌లను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై వారు ఎదురుదాడికి దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ కాలికి బుల్లెట్ గాయమవ్వగా, మరో నిందితుడు హరే రామ్‌కి కాలు విరిగింది. ఎన్కౌంటర్ అనంతరం వీరిద్దరినీ వెంటనే చికిత్స నిమిత్తం జముయి సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని బీహార్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ కేఎస్ అనుపమ్ అధికారికంగా ధృవీకరించారు. ఈ కేసు విచారణను పోలీసులు అత్యంత వేగంగా వేగవంతం చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో కొత్త నేర చట్టం BNSS లోని 128, 74, 75 సెక్షన్లతో పాటు చిన్న పిల్లలపై వేధింపుల నిరోధక చట్టం (POCSO) కింద సెక్షన్ 8, 12లను నమోదు చేశారు. అంతేకాకుండా, ఈ కేసును నిష్పాక్షికంగా, వేగంగా విచారించేందుకు జముయి ఎస్డీపీఓ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మొత్తానికి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితులపై జముయి పోలీసులు తీసుకున్న ఈ కఠిన చర్యతో స్థానికంగా పెద్ద ఎత్తున ఊరట వ్యక్తమవుతోంది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!