Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- భోపాల్లో గర్బా కార్యక్రమాలపై కొత్త రాజకీయ వివాదం
- ముస్లిం యువకులు ఒంటరిగా రావొద్దన్న బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ
- సోదరీమణులు, కుమార్తెలను వెంట తీసుకురావాలని వ్యాఖ్య
- “మా అబ్బాయిలు కూడా సిద్ధంగా ఉన్నారు” అంటూ వివాదాస్పద కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garba row: గర్బా కార్యక్రమాల్లోకి ముస్లింల ఎంట్రీపై వివాదం తీవ్రమవుతోంది. ‘‘లవ్ జిహాద్’’కు కేంద్రంగా గర్బా వేదికలు ఉండకూడదని హిందూ సంస్థలు, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హుజూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. ముస్లింలు గర్బాకు ఒంటరిగా రావొద్దని, తమ సోదరీమణులు, కుమార్తెలను కూడా వెంట తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ముస్లిం యువకులు గర్బాకు ఒంటరిగా ఎందుకు రావాలనుకుంటున్నారు? ఒంటరిగా రావొద్దు, సోదరీమణులు, కుమార్తెలను కూడా వెంట తీసుకురావాలి’’ అని అన్నారు. దీని తర్వాత ‘‘మా అబ్బాయిలు కూడా సిద్ధంగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించడంతో సభ నుంచి ఒక్కసారిగా పెద్ద స్పందన వచ్చింది. ముస్లింలు గర్బాకు రావాలనుకుంటే రావచ్చు, అయితే నుదుటిపై తిలకం పెట్టుకుని ‘జైశ్రీరాం’ అంటూ పాల్గొనాలని రామేశ్వర్ శర్మ అన్నారు. గోవుల్ని రక్షించడంలో పాలుపంచుకోవాలని సూచించారు.
Also Read
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎంఐఎం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. భోపాల్ సెంట్రల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మాసూద్ మాట్లాడుతూ.. మతపరమైన వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు మోహ్సీన్ అలీ ఖాన్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభజన తెస్తాయని, శర్మ రాజ్యాంగాన్ని చదవాలని అన్నారు.
తాజావార్తలు
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..