India vs Pakistan: శనివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. పాక్ ఏ దశలోనూ ఇండియాకి పోటీ ఇవ్వలేకపోయింది. రోహిత్ శర్మ సిక్సర్ల సునామీ ముందు పాక్ బౌలర్లు తేలిపోయారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులతో పాటు టీవీ సెట్ల ముందు, మొబైళ్లలో కోట్ల మంది భారతీయులు ఈ మ్యాచును వీక్షించారు. వరల్డ్ కప్ లో భారత్ కు ఎదురులేదని, పాకిస్తాన్ ను 8వ సారి ఓడించి నిరూపించారు.
Read Also: Israel-Hamas War: “హమాస్‌ని కూల్చేస్తాం”.. క్యాబినెట్ అత్యవసర సమావేశంలో ఇజ్రాయిల్ పీఎం
ఇదిలా ఉంటే పాకిస్తాన్ పై భారత్ గెలుపు గురించి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్స్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియన్ క్రికెట్ టీంని అభినందించకపోవడంపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటుంటే, ప్రతిపక్ష నాయకుడు భారత్ టీంని అభినందించలేదని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.
‘‘నిన్న ప్రపంచకప్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ ని ఓడించింది. దేశం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోయి విజయాన్ని సంబరంగా చేసుకుంటున్నారు. కానీ ‘మొహబ్బత్ కి దుకాన్’(ప్రేమ దుకాణం) నుంచి ఒక్క మాట రాలేదు’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Yesterday, Bharat defeated Pakistan in the World Cup cricket. Entire country erupted in joy and celebrated the win. But not a word from “Mohabbat ki Dukan”.
— Himanta Biswa Sarma (@himantabiswa) October 15, 2023