Lalu Prasad Yadav: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ రాజీనామా చేయాలి
- బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం
- ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్‌కుమార్ రాజీనామా చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీష్ తన మనస్సాక్షిని, తన ఆత్మను, బీహార్ గుర్తింపును, బీహార్ ఓట్ల ప్రాముఖ్యతను కేంద్రానికి అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం సోమవారం తేల్చిచెప్పిన నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2 పుకార్లకు బ్రేక్.. ఇక మొదలెడదామా?
Also Read
సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్.. ఆర్థికంగాను, పారిశ్రామికంగాను బీహార్ సహా ఇతర వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అని ఆర్థిక మంత్రిత్వ శాఖను అడిగారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏదీ లేదని తేల్చిచెప్పారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలన్నది జేడీయూ చిరకాల డిమాండ్. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ లభించలేదు. దీంతో బీహార్‌లోని నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీయూ, ఏపీలోని చంద్రబాబుకు చెందిన టీడీపీ మద్దతుతో మోడీ 3.0 సర్కార్ ఏర్పడింది. దీంతో ఈసారైనా ఆ కల నెరవేర్చుకోవాలని జేడీయూ భావించింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాల ముందు కేంద్రం ముందు ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ చివరకు నితీష్ సర్కార్ చుక్కెదురైంది. హోదా ఇచ్చే ప్రసక్తేలేదని కేంద్రం తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: Chamari Athapaththu: టీ20 ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్..
ప్రత్యేక హోదా అనేది వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర మద్దతుతో ఈ హోదా లభిస్తోంది. రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ.. 1969లో ఐదోవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ (ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం), ఈశాన్య రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!