Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan on Local Body Elections 2026: అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఈజీగా జరిగిందని, కానీ లోకల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో సీట్ల సర్దుబాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. కొందరికి సర్దిచెప్పి ముందుకెళ్తున్నాం అని, అగ్రనేతల ఐక్యతను కిందిస్థాయి నేతలు కూడా చూపించాలన్నారు. కూటమి అభ్యర్థులకు కొన్ని ఛాలెంజ్‌లు ఉన్నాయని, అభివృద్ధి పనులు కిందిస్థాయికి వెళ్లాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల ఔత్సాహికులు నామినేషన్లు వేశారని, బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలని సూచించారు. కూటమికి ప్రజల మద్దతు అవసరం అని పవన్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి జనసేన అధినేత పవన్ మాట్లాడారు.
‘కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి అనేక సవాళ్లు ఉన్నాయి. ఎన్నో టఫ్ సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో స్థానిక ఎన్నికలు కీలకం. సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీఎం చంద్రబాబును దగ్గర్నుంచి చూశాం. 2024 సీట్ల సర్దుబాటు ఈజీగా చేశాం. కానీ ఇప్పుడు కసరత్తు ఎక్కువగా జరిగింది. మేయర్లు, మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల సంఖ్య చూసే కొద్దీ పోటీ ఎక్కువయింది. టీడీపీ, జనసేన, బీజేపీ బలంగా ఉంది. ఎవరి పార్టీ అయినా బలంగానే ఉంది. కానీ సీట్ల సర్దుబాటులో సవాళ్లు వచ్చాయి. కానీ ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి లక్షన్నర కోట్ల నిధులుతో ముందుకు వెళ్తోంది. కింది స్థాయిలో కూడా సమన్వయం చూపాలని కోరుతున్నాం. గ్రామ స్థాయిలో అభివృద్ధి చూపాల్సిన అవసరం ఉంది’ అని జనసేన అధినేత పవన్ అన్నారు.
Also Read
- Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
- Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
- IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
- Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
‘పోలవరం, హంద్రీనీవా లాంటి ప్రాజెక్ట్స్ పూర్తి చేయటం జరుగుతుంది. గ్రామ స్వరాజ్యం అనేది చంద్రబాబుకి స్ఫూర్తి. కూటమి అభ్యర్థులందరికి ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కింద స్థాయికి వెళ్లాలంటే తప్పకుండా అందరు కలిసి ఉండాలి. స్థానిక ఎన్నికల్లో కూడా సాధారణ ఎన్నికల మాదిరి చాలా గొప్ప విజయాన్ని అందించాలని, కూటమి స్ఫూర్తిని ముందుకి తీసుకెళ్లాలని కూటమి నాయకులని కోరుకుంటున్నా. మేము బీఫామ్ ఎవరికైతే ఇస్తామో వారు మాత్రమే నిలబడాలి. దయచేసి మిగిలిన వారు మద్దతు ఇవ్వండి. సీట్ల సర్దుబాటు క్లిష్టంగా మారింది, చాలా ఒత్తిడి ఉంది. సీఎం అన్ని పక్కన పెట్టి చూసుకున్నారు. ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారికీ తప్పకుండా న్యాయం చేస్తాము. ఒకవైపు తుఫాన్ వస్తుంది, ప్రతి ఒక్కరం సమీక్ష నిర్వహిస్తున్నాము. ఎవరికీ ఎలాంటి ఆపద లేకుండా ప్రభుత్వం అప్రమతంగా సంసిద్ధంగా ఉన్నాము. కూటమికి మద్దతుగా అందరు నిలవాలని కోరుకుంటున్నాము. అభివృద్ధి పనులకి అశీస్సులు అందించండని కోరుకుంటున్నాను’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!