Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
- అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ ప్రారంభం
- వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తిగా ఉచితం
- అధికారిక శబరిమల ఆన్లైన్ పోర్టల్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలి
- నిలక్కల్-పంబ మార్గంలో రోజుకు 60 వేల వర్చువల్ క్యూ స్లాట్లు
- ఎరుమేలి, వండిపెరియార్-సత్రం మార్గాల్లో రోజుకు 3 వేల చొప్పున స్లాట్లు
- నిలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రంలో స్పాట్ బుకింగ్ కేంద్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్ ప్రకటన వెలుబడింది. ఈ ఏడాది మండల-మకరవిళక్కు యాత్రకు సంబంధించిన వర్చువల్ క్యూ స్లాట్ బుకింగ్స్ అక్టోబర్ 29 ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సేవను భక్తులు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. భక్తులు అధికారిక వెబ్సైట్ www.sabarimalaonline.org ద్వారా వర్చువల్ క్యూ టికెట్లను బుక్ చేసుకోవాలి. నిలక్కల్-పంబ మార్గంలో రోజుకు 60 వేల మందికి వర్చువల్ క్యూ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్-సత్రం మార్గాల్లో రోజుకు 3 వేల మంది చొప్పున ఆన్లైన్ టికెట్లు పొందవచ్చు.
వీటితోపాటు నిలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం ప్రాంతాల్లో రియల్‌టైమ్ స్పాట్ బుకింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. నిలక్కల్ కేంద్రం ద్వారా రోజుకు 10 వేల మందికి.. ఎరుమేలి, వండిపెరియార్ సత్రం కేంద్రాల ద్వారా 2 వేల మంది చొప్పున భక్తులకు అనుమతి ఉంటుంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు పంబలోని స్పాట్ బుకింగ్ కేంద్రాన్ని రద్దు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తిగా ఉచితం. భక్తులు కోరుకుంటే కనీసం రూ.5 నుంచి పిల్గ్రిమ్ రిలీఫ్ ఫండ్, జనరల్ ఫండ్‌కు విరాళం ఇవ్వవచ్చు. ఈ విరాళం ఇవ్వడం తప్పనిసరి కాదు.
Also Read
- Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
- IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
భక్తులు బుకింగ్ చేసుకునే ముందే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఆధార్, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు పత్రం అవసరం. 30KB కంటే తక్కువ సైజులో ఉన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఫోన్ లేదా కంప్యూటర్లో సిద్ధంగా ఉంచుకోవాలి.
వర్చువల్ క్యూ ఎలా బుక్ చేసుకోవాలి?
* ముందుగా శబరిమల ఆన్లైన్ సర్వీసెస్ అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేసి ‘Register’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నమోదు చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. దీనితో మొబైల్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరించిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇప్పటికే ఖాతా ఉన్నవారు నేరుగా లాగిన్ కావచ్చు.
* లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ వివరాలను నమోదు చేసి గుర్తింపు కార్డు రకం, నంబర్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ‘Virtual Queue’ లేదా ‘Darshan’ ఆప్షన్‌ను ఎంచుకుని అందుబాటులో ఉన్న తేదీ, సమయ స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే కొండపైకి వెళ్లే మార్గాన్ని కూడా ఎంచుకోవాలి.
* మీతో వచ్చే ఇతర భక్తుల వివరాలను కూడా నిర్దేశిత పరిమితిలో ఒకే ఖాతా ద్వారా నమోదు చేసుకోవచ్చు. వారి ఫోటోలు, గుర్తింపు పత్రాల వివరాలను కూడా అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత ‘Submit’ లేదా ‘Confirm Booking’పై క్లిక్ చేయాలి.
* బుకింగ్ విజయవంతమైన వెంటనే క్యూఆర్ కోడ్‌తో కూడిన వర్చువల్ క్యూ కూపన్ వస్తుంది. దాన్ని పీడీఎఫ్ రూపంలో మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవడం మంచిది. ముఖ్యంగా నకిలీ వెబ్సైట్లను నమ్మకుండా అధికారిక పోర్టల్‌లోనే బుకింగ్ చేసుకోవాలి.
తాజావార్తలు
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా