Pushpa 2 The Rule shoot Resumes Tomorrow: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు మొదలయ్యాయని అల్లు అర్జున్ విదేశాలకు వెళుతూ గడ్డం కూడా తీసేశాడు కాబట్టి పుష్ప సినిమా యూనిట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేమీ నిజంగాదని పలువురు పలు సందర్భాలలో క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇంత వివాదాస్పదమైన అంశాల తర్వాత ఎట్టకేలకు పుష్ప 2 సినిమా షూటింగ్ రేపు మొదలు కాబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి నార్వే వెకేషన్ లో ఉన్నాడు. యూఎస్ఏ వెళ్లిన సుకుమార్ చిన్నపాటి వెకేషన్ తర్వాత తిరిగొచ్చి షూట్ మొదలు పెడుతున్నారు. ఇక పుష్ప 2: ది రూల్ షూటింగ్ రేపు తిరిగి ప్రారంభమవుతుంది.
Tharun Sudhir Marriage : జైల్లో దర్శన్.. పెళ్ళికి రెడీ అయిన డైరెక్టర్-హీరోయిన్!
అల్లు అర్జున్ అవసరం లేని ఎపిసోడ్‌లను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ షూటింగ్‌లో జాయిన్ అవుతాడని అంటున్నారు. నిజానికి ఫహద్ ఫాసిల్ షూట్ పార్ట్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది, ముందు ఆయన భాగాన్ని షూట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ వచ్చే నెలలో పుష్ప 2: ది రూల్ సెట్స్‌లో జాయిన్ అవుతారని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మొదలైన ఊహాగానాలకు ముగింపు పలకడానికి మేకర్స్ కూడా అధికారిక ప్రకటనను జారీ చేస్తారని అంటున్నారు. పుష్ప 2: రూల్ తదుపరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం కూడా పాల్గొంటారని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎడిటింగ్ పనులను కూడా సుకుమార్ పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక మంచి ఐటెం సాంగ్‌ను చిత్రీకరించనున్నారని కూడా తెలుస్తోంది. డిసెంబర్ 6న పుష్ప 2: ది రూల్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.