NewsClick Case: న్యూస్‌క్లిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ చైనా నుంచి నిధులు సమకూర్చుకుని 2020లో ఢిల్లీ అల్లర్లను ప్రోత్సహించాడని ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టుకు తెలిపారు. దీంతో పాటు కోవిడ్-19కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడంతో పాటు రైతులు ఆందోళనతో పాటు, కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ కోసం నిధులు సమకూర్చుకున్నట్లుగా పోలీసులు ఛార్జిషీటులో అభియోగాలు మోపారు. యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‌కి చెందిన చాలా మంది ఉద్యోగులకు పుర్కాయస్థ జీతాలు ఇచ్చేవారని ఛార్జిషీట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసులో మరో యాక్టివిస్ట్ గౌతమ్ నవ్లాఖా పాత్రపై విచారణ జరుగుతోంది.
న్యూస్‌క్లిక్‌లో నవ్లాఖాకు వాటాదారుగా ఉన్నాడని, నిషేధిత నక్సల్ సంస్థకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరాలో ఇతని పాత్ర ఉన్నందని తుది నివేదిక పేర్కొంది. న్యూస్‌క్లిక్ హెచ్ఆర్ హెడ్, అప్రూవర్‌గా మారిన నిందితుడు అమిత్ చక్రవర్తి చేసిన ప్రకటనల్ని ఛార్జిషీటులో ఉదహరించారు. తీస్తా సెతల్వాడ్ తన ఎన్జీవో సబ్రంగ్, ఆమె భర్త, ఇతరుల ద్వారా సమాజంలో మతపరమైన ఉద్రిక్తతల్ని వ్యాప్తి చేయడానికి డబ్బులు వినియోగిస్తానని నిధులు సమకూర్చుకుందని, ఈ నిధులు ఆమె భర్త, కుమార్తె, కుమారుడు, ఇతర సిబ్బందికి చెల్లించారని స్టేట్మెంట్ పేర్కొంది.
శ్రీలంక సంతతికి చెందిన అమెరికా జాతీయుడు నెవెల్లి రాయ్ సింఘమ్ యాజమాన్యంలోని వివిధ కంపెనీల నుంచి పుర్కాయస్థ అక్రమ నిధులు స్వీకరించేవాడని, గత దశాబ్ధ కాలంగా మావోయిస్టు ఆలోచనల్ని తీవ్రంగా ప్రచారం చేస్తున్నట్లు స్టేట్మెంట్ వెల్లడించింది. సింఘమ్ నుండి వచ్చిన నిధులలో, 2020 ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించినందుకు షార్జీల్ ఇమామ్‌కు మరిన్ని నిధులు ఇవ్వాలనే సూచన మేరకు పుర్కాయస్థ రూ. 36 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఏఏ, ఎన్సీఆర్ నిరసనల్లో హింసను సృష్టించేందుకు SFI కార్యకర్త అనూషా పాల్ మరియు పవన్ కులకర్ణికి నిధుల నుండి కొంత మొత్తాన్ని కూడా అందించారు. ఈ సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందింది, ప్రజలు ఇండియన్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటానికి కథనాలు రాయడం ద్వారా దుష్ప్రచారం చేయాలని నెవెల్లి రాయ్ సింఘమ్, పుర్కాయస్థను ఆదేశించాడు. పర్యవసానంగా చాలా మంది చనిపోయి, ప్రభుత్వంపై అసంతృప్తి, అంతర్యుద్ధం తలెత్తే అవకాశం ఉందనే అభియోగాలు నమోదయ్యాయి.
Read Also: SRH vs RR: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న నితీష్ రెడ్డి, హెడ్.. రాజస్థాన్ టార్గెట్ 202..
రైతుల ఆందోళనకు మద్దతుగా పుర్కాయస్థ నిధుల్ని అందించారు. రైతులు రోడ్లు బ్లాక్ చేయడం ద్వారా అవసరమైన సేవలకి అంతరాయం కలిగించి, ఢిల్లీలో అరాచకం చెలరేగేలా చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఛార్జీషీట్ పేర్కొంది. కాశ్మీర్లో తిరుగుబాటును సృష్టించేందుకు పుర్కాయస్థ తన కుమారుడు ప్రతీక్ పుర్కయస్థ నేతృత్వంలో కాశ్మీర్ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశవ్యతిరేక శక్తులకు అక్రమ విదేశీ నిధులు చిన్నమొత్తాల్లో ఇచ్చారని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి మే 31తేదీకి వాయిదా వేశారు.
దేశానికి వ్యతిరేకం, చైనా నుంచి నిధులు తీసుకుని కుట్రకు పాల్పడిన అభియోగాలపై గతేడాది అక్టోబర్ నెలలో చక్రవర్తి, పుర్కాయస్థలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సార్వభౌమధికారాని భంగం కలిగించేలా ప్రయత్నించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చేసేందుకు పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (PADS) అనే గ్రూపుతో శ్రీ పుర్కాయస్థ కుట్ర పన్నారని కూడా ఆరోపించింది. అక్టోబర్ 3న ఢిల్లీలోని 88, ఇతర రాష్ట్రాల్లో ఏడు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. న్యూస్‌క్లిక్ కార్యాలయాలు మరియు జర్నలిస్టుల నివాసాల నుండి దాదాపు 300 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల అనంతరం తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులతో సహా 46 మందిని స్పెషల్ సెల్ ప్రశ్నించింది.