NewsClick Case: న్యూస్‌క్లిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ చైనా నుంచి నిధులు సమకూర్చుకుని 2020లో ఢిల్లీ అల్లర్లను ప్రోత్సహించాడని ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టుకు తెలిపారు.
ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ చైనా నుంచి నిధులు తీసుకుని దానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్‌క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు
మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) మరియు ఇతర సెక్షన్ల కింద "న్యూస్‌క్లిక్" వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్తతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బు అందుకున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.
న్యూస్‌క్లిక్ మీడియాసంస్థపై చర్యలు తీసుకోవాలని 255 మంది ప్రముఖులు డిమాండ్ చేశారు. సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు భారత రాష్ర్టపతి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)లకు లేఖలు రాశారు.