NewsClick Case: న్యూస్‌క్లిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ చైనా నుంచి నిధులు సమకూర్చుకుని 2020లో ఢిల్లీ అల్లర్లను ప్రోత్సహించాడని ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టుకు తెలిపారు.
దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో 'న్యూస్‌క్లిక్' వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.