Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New India Does Not Need Madrassas Says Himanta Biswa Sarma: అస్సాంలో ముస్లిం మత పాఠశాలలైన మదర్సాలన్నింటినీ ముసివేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం ఏమాత్రం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మనకి మదర్సాల అవసరం లేదని, ఇంజినీర్లు & డాక్లర్ల అవసరం ఉందని చెప్పారు. మదర్సాల కంటే మన భారతదేశానికి , అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉందని పేర్కొన్నారు.
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్‌పై ప్రపంచ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశామని, మిగతా వాటిని కూడా క్రమంగా మూసేస్తామని హిమంత బిశ్వ శర్మ అన్నారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న జనంతో.. మన భారత సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలామంది ఉన్నారు కానీ.. హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్‌ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. వీటిపై రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.
Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది
కాగా.. అస్సాంలో ప్రస్తుతం 3,000 నమోదిత, నమోదుకాని మదర్సాలు ఉన్నాయి. గతంలో హిమంత బిశ్వ శర్మ మదర్సాలను తగ్గించాలని లేదా మదర్సాలలో ఇస్తున్న విద్యను పరిశీలించాలని సూచించారు. 2020లో అన్ని ప్రభుత్వ మదర్సాలను ‘రెగ్యులర్ స్కూల్స్’గా మార్చడానికి వీలు కల్పించే చట్టాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. విద్య పట్ల సానుకూల దృక్పథం ఉన్న బెంగాలీ ముస్లింలతో.. మదర్సాలలో ‘మంచి వాతావరణాన్ని’ సృష్టించేందుకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. మదర్సాలలో సైన్స్, గణితం కూడా సబ్జెక్టులుగా బోధించబడుతుందని.. విద్యాహక్కు గౌరవం, ఉపాధ్యాయుల డేటాబేస్ నిర్వహించబడుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!