Assam Love Jihad Bill: అస్సాం ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో “లవ్ జిహాద్”, బహుభార్యత్వాన్ని అరికట్టడానికి కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో లవ్ జిహాద్, బహుభార్యత్వం వంటి అంశాలను పరిష్కరించే అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. మంత్రివర్గం వాటిని ఆమోదించిన తర్వాత వివరాలను అందిస్తామని సీఎం పేర్కొన్నారు. READ ALSO: Russia Nuclear Drills: అమెరికాతో…
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…