National Highways Authority asks Mysuru civic body to demolish dome-shaped bus stand: కర్ణాటక మైసూరు నగరంలో ఉన్న మసీదు డోమ్ ఆకారంలోని బస్టాప్ వివాదాస్పదం అయింది. కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మైసూరు-ఊటీ రోడ్‌లోని మసీదు లాంటి బస్టాండ్‌ను బుల్డోజర్ చేస్తానని హెచ్చరించారు. ఈ హెచ్చరికల తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) వివాదాస్పద బస్టాప్ ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బస్టాప్ మైసూరు-ఊటీ రోడ్డులో ఉంది. బస్టాప్ ను కూల్చివేయాలని మైసూర్ సిటీ కార్పొరేషన్, కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్మాణాన్ని తొలగింేందుకు వారం రోజుల గడువు విధించింది. చర్యలు తీసుకోకుంటే.. హైవే అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 2003 ప్రకారం ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
Read Also: Twitter: అలా అయితేనే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మసీదు డోమ్ తరహాలో బస్టాప్ నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే స్వతహా బుల్డోజర్ తో కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ బస్టాప్ నిర్మాణంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కృష్ణంరాజు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్‌ఏ రాందాస్ మాట్లాడుతూ.. మైసూరు ప్యాలెస్‌ను తలపించేలా ఈ బస్టాప్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. మైసూరు చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను చాటిచెప్పేందుకు మంత్రి నిధులతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మైసూరు ప్యాలెస్‌ను తలపించేలా వివిధ డిజైన్లతో బస్టాప్‌లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 10 లక్షల వ్యయంతో ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు.
దీనిపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా.. బస్టాండ్ లో మూడు గోపురాలు ఉన్నాయి. మధ్యలో గోపురం పెద్దదిగా, పక్కను ఉండే రెండు గోపురాలు చిన్నవిగా ఉన్నాయని ఇది ఖచ్చితంగా మసీదు మాత్రమే అని అన్నారు. మైసూరులో చాలా ప్రాంతాలో ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. మూడు నాలుగు రోజుల్లో నిర్మాణాలను కూల్చేయాలని ఇంజనీర్లకు చెప్పారు. అలా చేయకుంటే నేనే జేసీబీతో కూల్చేస్తామని అన్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కర్ణాటక కాంగెస్ నాయకుడు సలీం అహ్మద్ మాట్లాడుతూ.. ఇది మైసురు ఎంపీ మూర్ఖపు ప్రకటన అని.. గోపరం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చేస్తారా..? అని ప్రశ్నించారు.
National Highways Authority of India (NHAI) issues notice to Mysore City Corporation for the removal of a "structure constructed to achieve controversial kind of issues" at a bus stop in Mysuru, Karnataka; grants them one-week time for the removal of the structure. pic.twitter.com/2LqYdqsffn
— ANI (@ANI) November 17, 2022