Supreme Court: తెల్లవారుజామున ఘటన, రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్.? కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సీరియస్..
- కోల్‌కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ..
- బెంగాల్ ప్రభుత్వం.. పోలీసులు లోపాలను ఎత్తి చూపిన సీజేఐ..
- తెల్లవారుజామున ఘటన..రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రెకెత్తించింది. ‘‘పాతుకుపోయిన పితృస్వామ్య పక్షపాతం కారణంగా మహిళా వైద్యులు ఎక్కువగా లక్ష్యమవుతున్నారు. వైద్యవృత్తులు హింసకు గురవుతున్నాయి. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరినందున, పరిస్థితులు మారడం కోసం దేశం మరొక అత్యాచారం కోసం వేచి ఉండదు’’ అని చంద్రచూడ్ అన్నారు.
అయితే, ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేయడంపై, కేసుని నిర్వహించడంతో నిర్లక్ష్యం, లోపాలపై బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం, ఆస్పత్రి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పోలీసుల చర్యలకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. మృతదేహానికి దహన సంస్కారాలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు..? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
Read Also: Hanuman In USA: వావ్.. అమెరికాలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట..
‘‘ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు..? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు.?? మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు, పోలీసుల ఏం చేస్తున్నారు..? తీవ్రమైన నేరం జరిగింది, క్రైమ్ సీన్ హస్పిటల్లో ఉంది.. వారు ఏం చేస్తున్నారు..? విధ్వంసకులను ఆస్పత్రిలోకి ప్రవేశిస్తారా..? అని చంద్రచూడ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించారు. బెంచ్ ప్రశ్నలకు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. హాస్పిటల్ వ్యక్తులు ఫోటోలు తీశారని, అసహజ మరణానికి సంబంధించిన కేసు వెంటనే ప్రారంభించారని చెప్పారు. ముఖ్యంగా బాధితురాలి తల్లిదండ్రులు గైర్హాజరైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆస్పత్రి ప్రధాన విధి అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.
జస్టిస్ పార్దీవాలా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయం గురించి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మొదటి ఇన్ఫార్మర్ ఎవరు..? ఎఫ్ఐఆర్ నమోదైన టైమ్ ఎంత..?, అని ప్రశ్నించారు. బాధితురాలి తండ్రి అని, అతను రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున వాదిస్తున్న సిబల్ చెప్పారు. రాత్రి 8.30 గంటలకు బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారాలు చేసిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1.45 నుంచి 4.00 గంటల మధ్య పోస్టుమార్టం నివేదిక హత్య అని తేల్చింది. అయితే, ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. ఆ సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్, ఆస్పత్రి బోర్డు ఏం చేస్తున్నారు..? అని సీజేఐ ప్రశ్నించారు.
బాధితురాలి పేరు, ఫోటోలు మీడియాలో రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది యువవైద్యులు 36 గంటలు పనిచేస్తున్నారని, సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి మేము జాతీయ ప్రోటోకాల్‌ని రూపొందించాలని కోర్టు పేర్కొంది. నేరం తెల్లవారుజామున జరిగితే దానిని ఆత్మహత్యగా మార్చడానికి ప్రిన్సిపాల్ ప్రయత్నించాడని కోర్టు పేర్కొంది. మరోవైపు ఘటన సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ని సీబీఐ మూడు రోజలుగా ప్రశ్నిస్తోంది. ఘటన సమయంలో ప్రిన్సిపాల్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి రాజీనామా చేసిన తర్వాత, కలకత్తా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమమించడం ఏంటని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!