Supreme Court: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలు నిరసనల్లో పాల్గొన్నారు. సినీ దర్శకురాలు అపర్ణా సేన్‌తో సహా బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం వేలాది మంది ప్రజలతో కలిసి నిరసనల్లో పాలు పంచుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి చేపడుతుంది.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్ని మమతా బెనర్జీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమతా బెనర్జీపై బీజేపీ విమర్శల దాడిని ఎక్కువ చేసింది.
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్‌జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది.
కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఆగస్టు 17న దేశవ్యాప్తంగా అన్ని చిన్నా, పెద్దా ఆసుపత్రులను మూసివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 24 గంటల పాటు వైద్యులు సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే సమ్మె మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.