RG Kar ex-principal:కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సీబీఐ స్పెషల్ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. సందీప్ ఘోష్ కి బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం రుజువైతే మరణశిక్ష తప్పదని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వెల్లడించింది.
Kolkata doctor case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది.
Mamata Banerjee: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా వైద్యులు బాధితురాలికి న్యాయం జరిగాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కలకత్తా హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్‌జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది.
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం మమతా బెనర్జీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఈ ఘటనపై ఆరోపణలు చేసిన పలువురికి బెంగాల్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి కోల్‌కతా పోలీసులు బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ, కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామి అనే ఇద్దరు వైద్యులకు సమన్లు జారీ చేశారు.
Kolkata incident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన వార్త విన్న వారెవరికైనా కాళ్ల కింద నుంచి నేల కదులుతుంది.