Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్‌లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
Pakistan: పాకిస్తాన్ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
Pakistan: పాకిస్తాన్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళన చెందిన పాకిస్తాన్ UNSC తో సమావేశం కావాలని అభ్యర్థించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. ఈ సమావేశాన్ని పాకిస్తాన్ మరోసారి భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఉపయోగించుకుంది. సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు పాకిస్తాన్…
పూంచ్‌లో ఆర్మీ వాహనంపై దాడి ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన 6 మంది వ్యక్తుల ప్రమేయం ఉందని, అందులో ఒకరి కుటుంబం మొత్తం కుట్రలో భాగమేనని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగ్గురు సాయుధ హైబ్రిడ్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి 3 ఏకే 47 రైఫిల్స్, 2 పిస్టల్స్, 9 మ్యాగజైన్లు, 200 రౌండ్స్ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…