ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే పార్సిల్ లో మరొకటి రావడం సహజమే. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ గురించి ఆర్డర్ చేస్తే వాటి స్థానంలో ఇటుక రాళ్లు, చెక్కలు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఓ వ్యక్తి మౌత్ వాష్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. అతనికి వచ్చిన పార్సిల్ ను చూసి షాక్ అయ్యాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా, అందులో మౌత్ వాష్ కు బదులుగా మొబైల్ ఫోన్ ఉన్నది. మాములుగా అయితే విలువైన వస్తువు కావడంతో అలానే చెప్పకుండా ఉంచేసుకుంటారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. తానూ రూ.390కి మౌత్ వాష్ బుక్ చేస్తే దానికి బదులుగా రూ.12500 విలువ చేసే రెడ్ మీ మొబై ఫోన్ వచ్చిందని సదరు కంపెనీకి ట్వీట్ చేసాడు. మెయిల్ ద్వారా విషయాన్ని కంపెనీకి వివరించాడు. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.