దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తిట్టారన్న కోపంతో ఇంటి యజమానురాలిని, ఆమె చిన్న కుమారుడిని అత్యంత దారుణంగా పని మనిషి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: YV Subba Reddy: ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు.. సాయంత్రం 7 తర్వాతే పోలింగ్..!
ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఇంటి యజమాని రుచిక సెవానీ, ఆమె కొడుకు.. పని మనిషిపై కేకలు వేశారు. అంతే కోపం పెంచుకుని.. రుచికను, ఆమె చిన్న కొడుకు గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Nithya Menen : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా..
బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రుచిక భర్త కుల్దీప్ సెవానీ.. ఆఫీసు పని ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు మూసి ఉండటం గమనించాడు. భార్య, 14 ఏళ్ల కుమారుడు క్రిష్‌కు ఫోన్ చేశాడు. కానీ ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కుల్దీప్ సెవానీ గేటు దగ్గర, మెట్లపై రక్తపు మరకలు గమనించాడు. భయపడి.. అతడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి భార్య, కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూసేసరికి భార్య, కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి అవాక్కయ్యాడు. రుచిక (42) మంచం పక్కన నేలపై పడి ఉంది. మొత్తం రక్తంతో నిండి ఉంది. ఇక కుమారుడు క్రిష్ పదో తరగతి చదువుతున్నాడు. బాత్రూమ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నాడు.
రుచిక సెవానీ తన భర్తతో కలిసి లజ్‌పత్ నగర్ మార్కెట్లో బట్టల దుకాణం నడుపుతూ ఉంది. దుకాణంలో పని చేసే ముఖేష్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరం నుంచి పారిపోతుండగా ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రుచిక, ఆమె కొడుకు తిట్టినందుకే చంపేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. ముఖేష్‌ది బీహార్. అమర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.