భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన పలు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ డ్రామాగా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరో సరసన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ, ఒక్క నటి మాత్రం ప్రభాస్ విషయంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని చెప్పింది..
Also Read : Mysaa Movie: రష్మిక.. ‘మైసా’ టైటిల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?
ఆమె ఎవరో కాదు.. టాలెంటెడ్ నటీమణి నిత్యా మీనన్. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తన సహజమైన నటనతో త్వరలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హీరోయిన్ గానే కాకుండా ఇటు సింగర్‌గా కూడా రాణించిన ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసింది. నిత్య మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాకు తెలుగు కూడా బాగా రాదు. ఆ సమయంలో ఎవరో ప్రభాస్ గురించి అడిగారు. నాకు తెలియదని అన్నాను. దాంతో చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. విమర్శలు చేశారు. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని .. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని తెలిసింది. ఇప్పటికీ ఆ ఇష్యూ నన్ను మానసికంగా బాధ పడుతుంది’ అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్య మీనన్.