దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తిట్టారన్న కోపంతో ఇంటి యజమానురాలిని, ఆమె చిన్న కుమారుడిని అత్యంత దారుణంగా పని మనిషి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆ దంపతులిది బుధవారం వివాహ వార్షికోత్సవం. ఘనంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని భావించారు. కానీ అదే వారికి చివరి రోజు అని గమనించలేకపోయారు. ఇంట్లో నుంచే మృత్యువు ఎదురొస్తుందని ఆ జంట గమనించలేకపోయారు. తెల్లారేసరికి శవాలుగా మారిపోయారు.