Udhayanidhi Stalin: గతేడాది డీఎంకే పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సోమవారం ఖండించింది. ప్రతిపక్ష నేతృత్వంలోని భారత కూటమికి అలాంటి వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంది.
Amit Shah: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు తమిళనాడుతో మొదలు దేశంలోని నాయకులు డీఎంకే, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని ద్వేషిస్తోందని, అది మన వారసత్వంపై…
Annamalai: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడండి’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది.
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై…