MK Stalin: మదురైని మణిపూర్‌లా మార్చాలనుకున్నారు.. బీజేపీపై స్టాలిన్ విమర్శలు..
- మదురైని మణిపూర్‌లా చేయాలనుకున్నారు..
- బీజేపీపై విమర్శలు గుప్పించిన సీఎం స్టాలిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా, సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మదురైలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మదురైని మణిపూర్‌లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మదురైలో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ వివాదాన్ని స్టాలిన్ ప్రస్తావించారు.
Read Also: New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
మదురై హైకోర్టు, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని డీఎంకే సర్కార్ సవాలు చేసింది. ఈ వివాదం గురించి స్టాలిన్ ప్రస్తావించారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు. “శాంతి, సౌభ్రాతృత్వం తమిళనాడు డీఎన్ఏ. కానీ ఎన్డీఏ దీనిని నాశనం చేయాలనుకుంటోంది,” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీది ‘‘విభజనవాద ఆర్య నమూనా’’ అని అన్నారు. మదురైని మణిపూర్ చేయాలని చూస్తోందని ఆరోపించారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు ఎన్నో రూపాయలు చెల్లిస్తోందని, కానీ తిరిగి ఇచ్చే డబ్బులు మాత్రం తక్కువ అని విమర్శించారు. తమిళనాడు దివాలా తీస్తుందని బీజేపీ ఆరోపిస్తోందని,అయితే దివాలా తీసేది మాత్రం ఎన్డీయే అని స్టాలిన్ ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?