TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎమోషనల్ అయ్యాడు. స్టేజి మీదే అందరి ముందు ఏడ్చేశాడు. విజయ్ పెట్టిన పార్టీ టీవీకే. పార్టీని అనౌన్స్ చేసే కార్యక్రమం తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు నేడు మధురలో మానాడు కార్యక్రమం నిర్వహించారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో తనకోసం వచ్చిన లక్షల మందిని చూసి విజయ్ ఉప్పొంగిపోయారు. ఆయన…
TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. టీవీకే పార్టీ మానాడు కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళనాడులో సింహం వేట మొదలైంది. ఇక నుంచి రణరంగమే జరుగుతుంది. తమిళనాడులోని ప్రతి ఇంటి డోర్ కొడుతాం. అందరినీ కలుపుకునిపోతాం. ఏ పార్టీతోనూ మేం చేతులు కలపం. ఒంటరిగానే పోరాడుతాం.…
Amit Shah: తమిళనాడులో పర్యటిస్తు్న్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా, అధికార పార్టీ డీఎంకేపై విరుచుకుపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన పార్టీ డీఎంకే నాలుగేళ్లలో అవినీతికి సంబంధించి అన్ని పరిమితుల్ని దాటిందని ఆదివారం అన్నారు. మధురైలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు.
Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి.
Amit Shah: శుక్రవారం చెన్నైలో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా అధికారికంగా ధ్రువీకరించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమిళ భాష, తమిళ సంస్కృతిని గౌరవిస్తుందని, సీఎం స్టాలిన్ తమిళ భాష కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
AIADMK-BJP: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, అధికార డీఎంకేని గద్దె దించే లక్ష్యంతో బీజేపీ, ఏఐడీఎంకేలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.