Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పిచ్చితో అవకాశాల కోసం ఎన్నో ఏళ్లు పోరాడిన ఒక సాధారణ యువకుడి కల నెరవేరితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ‘హుషార్ పిట్టలు’ మూవీ ప్రెస్ మీట్లో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ సినిమాలో ‘పుట్ట భాను’గా నటించిన నటుడు భాను, మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇది కలా నిజమో అర్ధం కావడం లేదంటూ అతను పొట్టు పొట్టున తన చెంప మీద కొట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈవెంట్లో భాను మాట్లాడుతూ, “నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఎక్కువ. ఊర్లో ఏ సినిమా పడ్డా ఫస్ట్ షో థియేటర్లో వాలిపోయేవాడిని. స్క్రీన్ మీద కామెడీ చూసి నవ్వుకునే నేను, మొన్న ‘హుషార్ పిట్టలు’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద నన్ను చూసి కింద జనాలు నవ్వుతుంటే కళ్లంబడి నీళ్లు తిరిగాయి. అసలు ఇది కలనా, నిజమా అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా నటుడిగా నిరూపించుకోవాలనే పట్టుదలతోనే ఇన్నాళ్లూ ఉన్నాను” అని ఎమోషనల్ అయ్యారు.
సినిమా అవకాశాల కోసం తాను పడిన తపనను పంచుకుంటూ, “చాన్స్ రావాలని బోయిన్ పల్లి ఎల్లమ్మ తల్లికి మొక్కుకుని, ప్రతి మంగళవారం చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగాను. అవకాశం వచ్చి సినిమా రిలీజ్ అయ్యాక దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. కానీ నన్ను ఒక నటుడిగా నిలబెట్టి, ఇంత మంచి పాత్ర ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన మా డైరెక్టర్ భిక్ష అన్న, ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే అమ్మవారితో పాటు, నాకు లైఫ్ ఇచ్చిన వీళ్లకు కూడా ప్రత్యేకంగా 100 కొబ్బరికాయలు కొడతాను” అని భాను కృతజ్ఞతలు తెలిపారు. చిన్న క్యారెక్టర్ అనుకుంటే తనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న మంచి పాత్ర ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భాను మాట్లాడిన ఈ నిష్కల్మషమైన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
- Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
- Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
- Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
తాజావార్తలు
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!