Minister Ashwini Vaishnav: గత దశాబ్ద కాలం తో పోల్చుకుంటే ప్రస్తుతం టెక్నాలజీ చాల అభివృద్ధి చెందింది. ఇక ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI ) తో ఉపయోగాలు ఉన్న.. కొందరు ఆకతాయిలు ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫేక్ కంటెంట్ ను తాయారు చేస్తున్నారు. ఫోటో లను వీడియో లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు చాలంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ పైన ద్రుష్టి సారించారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ నేపధ్యంలో అన్ని కంపెనీల ప్రతినిధులు, నాస్కామ్, ఏఐ రంగానికి చెందిన ప్రొఫెసర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు.
Read also:Dhruva Nakshatram: సక్సస్ ఫుల్ గా ఈసారి కూడా వాయిదా అయినట్లే మాస్టారు…
ఈ సమావేశంలో డీప్ ఫేక్ కంటెంట్ ను గుర్తించడం, దానిని నిరోధించడం, అలానే రిపోర్టింగ్ మెకానిజమ్‌లను బలోపేతం చేయడం తో పాటుగా ఫేక్ కంటెంట్ ను షేర్ చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడం.. ఈ నాలుగు విషయాల పైన చర్యలు తీసుకునే అంశాలను 10 రోజుల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇక పైన ఫేక్ కంటెంట్ ను సృష్టించిన, అప్లోడ్ చేసిన, షేర్ చేసిన వ్యక్తులు శిక్షార్హులని.. అలాంటి వారిపై జరిమానా విధించబడుతుందని.. దీనికి సంబంధించిన చట్టం రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.