సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాఘవన్, ఏం మాయ చేసావే, ఎంత వాడు గానీ, కాక్క కాకా లాంటి సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. మణిరత్నం తర్వాత అంత పొయిటిక్ గా ప్రేమని ప్రెజెంట్ చేయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్, స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా కూడా మారి అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏ సమయంలో చియాన్ విక్రమ్ తో ధ్రువ నక్షత్రం సినిమాని స్టార్ట్ చేసాడో కానీ అసలు ఈ ప్రాజెక్ట్ కి వచ్చినన్ని కష్టాలు ఇండియాలో ఏ సినిమాకి వచ్చి ఉండవు. షూటింగ్ టైమ్ కి కంప్లీట్ అవ్వకపోవడం, ఆ తర్వాత విక్రమ్ డబ్బింగ్ చెప్పడానికి డిలే చేయడం, ఏళ్ల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడం, 2017 నుంచి వాయిదా పడుతూనే ఉండడం… లాంటి విషయాలు చూస్తుంటే ధృవ నక్షత్రం సినిమాని కర్ణుడి కష్టాలు చుట్టేశాయేమో అనిపించకమానదు.
తను యాక్టర్ గా మారి, తనకి వచ్చిన రెమ్యునరేషన్ తో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నక్షత్రం సినిమా పనులని కంప్లీట్ చేసి ఎట్టకేలకు నవంబర్ 24న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇలాంటి సమయంలో విక్రమ్ కూడా గౌతమ్ మీనన్ కి అండగా నిలబడలేదు, సినిమాని ప్రమోట్ కూడా చెయ్యలేదు. ఏం జరిగినా సినిమాని రిలీజ్ చేస్తానని గౌతమ్ మీనన్ తేల్చి చెప్పడంతో ధృవ నక్షత్రం ఈసారి పక్కా రిలీజ్ అవుతుందని విక్రమ్ ఫ్యాన్స్ భావించారు… బెంగళూరు, కొన్ని ఓవర్సీస్ సెంటర్స్ లో కూడా ధృవ నక్షత్రం సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. 24 గంటల్లో రిలీజ్ పెట్టుకోని బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయకపోవడంతో ధృవ నక్షత్రం సినిమా ఈసారి కూడా వాయిదా పడినట్లేనని కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో కానీ గౌతమ్ మీనన్ కనీసం ధృవ నక్షత్రం సినిమాని ఓటీటీకి ఇచ్చేసిన బాగుండని విక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, అది జరిగేలా కనిపించట్లేదు. మరి గౌతమ్ మీనన్… ధృవ నక్షత్రం ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి సినిమాని రేపు థియేటర్స్ లోకి తీసుకోని వస్తాడో లేదో చూడాలి.