నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. నిన్నఈ సినిమా సెకండ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను చిత్తూరులో గ్రాండ్ గా నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులుతో పాటు మూవీ టీమ్ ఈవెంట్లో సందడి చేసారు.
Also Read : Vishwambhara : విశ్వంభర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
కాగా నేడు చిత్ర హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే లేడి సూపర్ స్టార్ విజయశాంతి తిరుమల శ్రీవారిని నేడు వీఐపీ బ్రేక్ లో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ గా మారాయి. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘ తల్లి ప్రాముఖ్యత ఎమిటో మా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో ఉంటుంది. సినిమా విడుదల కు ముందు స్వామి వారి అశ్శీసులు తీసుకుని మా సినిమా విజయం సాధించాలని స్వామీ వారిని నమస్కరించాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్శీస్సులు ఉంటే బాలకృష్ణ బాబాయ్ తో కలసి నటిస్తాము. మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 12న హైదరాబాద్ లో ఉంటుంది. ఈ వేడుకకు మా తమ్ముడు ఎన్ టిఅర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఏప్రిల్ 18న రిలీజ్ అవబోతున్న మా సినిమా మీ అందరికి తప్పకుండ నచుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ చూడండి’ అని అన్నారు.