విశ్వవిద్యాలయాలు.. ఆ పేరుకు తగ్గట్టుగానే ఉండాలి. యూనివర్సిటీలు తమ ఔనత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ గొప్ప పేరు సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయాల మీద నమ్మకం కలుగుతుంది. లేదంటే విద్యార్థుల దృష్టిలోనూ.. విద్యావ్యవస్థలోనూ చెడ్డపేరు మూటగట్టుకోవల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో భీమ్‌రావు అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. యూనివర్శిటీ నిర్వాకంతో విద్యార్థులు, విద్యావేత్తలంతా నోరెళ్లబెడుతున్నారు.
ఇది కూడా చదవండి: BJP: ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకే! ఆ దిశగా అధిష్టానం అడుగులు
ముజఫర్‌పూర్‌లో ఉన్న భీమ్ రావు అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన పరీక్షల్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకున్నాయి. 100 మార్కుల పరీక్షలో 257 మార్కులు, ఇక 30 మార్కుల ప్రాక్టీకల్ పరీక్షల్లో 225 మార్కులు వేశారు. ఇలా చాలా మందికి ఎక్కువ మార్కులు పడడంతో విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరం అంటూ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. ఇంకో విచిత్రమేంటంటే.. బాగా చదవి.. అన్ని పరీక్షలకు హాజరైన విద్యార్థులు మాత్రం ఫెయిలైపోయారు. ఇక వీళ్ల గోడు వర్ణణాతీతం.
ఇది కూడా చదవండి: Afghanistan: తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా.. ఆఫ్ఘన్ రాయబారిని అంగీకరిస్తూ ప్రకటన
ఇక ఈ గందరగోళంపై యూనివర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ రామ్ కమార్ స్పందించారు. తమ దృష్టికి రాగానే దర్యాప్తు చేశామని.. పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. ఎక్సెల్ షీట్లలో మాన్యువల్‌గా మార్కులు నమోదు చేసినప్పుడు కొన్ని లోపాలు జరిగాయని వివరించారు. నష్టపోయిన విద్యార్థుల ఫలితాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను హెచ్చరించడంతో పాటు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి సరిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రెండు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని.. మళ్లీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఇంకో విషయమేంటంటే.. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ యూనివర్సిటీలో ఇలా పలుమార్లు జరిగినట్లు తెలుస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అనేక మార్లు పొరపాట్లు జరిగాయి. ఎన్నోమార్లు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. యూనివర్సిటీ నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్‌లో ప్రమాదంలో పడేస్తున్నాయని విద్యార్థులు ధ్వజమెత్తుతున్నారు.