Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా స్టార్ట్ అయింది. ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తాజాగా, వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ట్రై చేస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీని వల్ల ఒక మహిళ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రమాదం బారినపడ్డారు. అయితే, వారు రైలు ఢీకొనకుండా తృటిలో తప్పించుకున్నారు. వారిని ఇతర ప్యాసింజర్లు కాపాడారు. విషయం తెలుసుకుని సంఘటన ప్రదేశానికి వచ్చిన రైల్వే అధికారులు పరిస్థితులను చక్కదిద్దారు.
Read Also: Daaku Maharaj: డాకు మహారాజ్ ఛేజింగ్ సీన్ షూటింగ్ వీడియో లీక్!
ఇక, ప్రయాగ్‌రాజ్- ఝాన్సీ రింగ్ రైలు సోమవారం రాత్రి ఒరై నుంచి ఝాన్సీకి రాగానే.. ప్రయాణీకులు దిగిన తర్వాత, రైలును ప్లాట్‌ఫామ్ నంబర్ ఎనిమిదిలోనికి వెళ్లింది. అయితే, ఫస్ట్ ప్లాట్‌ఫారమ్ నుంచి రైలు రావడం చూసి, ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే తొందరలో కదులుతున్న రైలులోకి ఎక్కడానికి ప్రయత్నించారు. దీంతో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరగడంతో.. పలువురు ప్యాసింజర్లు కింద పడిపోయారు. ఇది గమనించిన లోకో ఫైలెట్ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.