పసిడి ప్రియులకు శుభవార్త. తాజాగా బంగారం ధరలు ఉపశమనం కలిగించాయి. ఇటీవల హెచ్చు తగ్గులు అవుతున్న ధరలు.. సోమవారం మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.710 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Usha Vance: పెళ్లి ఉంగరం లేకుండా ఈవెంట్‌కు హాజరైన ఉషా వాన్స్.. రేకెత్తుతున్న కొత్త పుకార్లు!
24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.710 తగ్గగా రూ.1,25,130 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 650 తగ్గగా రూ.1,14,700 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.530 తగ్గగా రూ.93,850 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోడీ
ఇక వెండి ధర కూడా ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,63, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,71,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,63, 000 దగ్గర అమ్ముడవుతోంది.