MPs suspended: పార్లమెంట్లో వికృతంగా ప్రవర్తించినందుకు 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 13 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. సస్పెండ్ అయినవారిలో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఇద్దరు, డీఎంకేకి చెందిన ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష ఎంపీలు సభలో డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Parliament security breach: పార్లమెంట్ చొరబాటుదారుల ఉద్దేశం ఏమిటి..? పోలీసులకు ఏం చెప్పారు..?
బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కూడా 2001, డిసెంబర్ 13 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, పొగ డబ్బాలతో హల్చల్ చేశారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ కుట్రలో మొత్తం ఆరుగురు ప్రమేయం ఉంది. ప్రస్తుతం నలుగురితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నారు.