దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులు.. రాడ్లతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే బర్త్‌డే బాయ్ కుప్పకూలిపోయాడు. మరో స్నేహితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఇది కూడా చదవండి: Himanshi Narwal: ఆపరేషన్ మహాదేవ్‌పై స్పందించిన వినయ్ నర్వాల్ సతీమణి
బుధవారం వికాస్‌ది పుట్టిన రోజు. స్నేహితుడు సుమిత్‌తో కలిసి పేపర్ మార్కెట్ ప్రాంతంలోని ఒక మద్యం దుకాణం దగ్గరకు వెళ్లారు. వికాస్ వాహనంపై ఉన్నప్పుడు బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వికాస్‌కు రైడర్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే సుమిత్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇంకోవైపు రైడర్ కూడా తన స్నేహితులకు ఫోన్ చేసి సంఘటనాస్థలికి రప్పించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంతే వికాస్, సుమిత్‌పై విచక్షణారహితంగా రైడర్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు కత్తులు, రాడ్లతో విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలతో సంఘటనాస్థలిలోనే వికాస్ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. సుమిత్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదే పదే పొడవడంతోనే వికాస్ ఉన్నచోటే మరణించాడు. సుమిత్‌ను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ
వికాస్ నోయిడాలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. కుమారుడి మరణవార్త తెలిసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. త్వరలోనే వివాహం జరగాల్సి ఉందని వాపోయారు. వికాస్‌ది హర్యానాలోని ఫరీదాబాద్. ఉదయం డ్యూటీకి వెళ్లాడని.. నోయిడాలో స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడని.. రాత్రికి బర్త్‌డే పార్టీ చేసుకుని ఉదయం తిరిగి ఇంటికి వస్తానన్నాడని వికాస్ తల్లి చెప్పింది.