Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్…
మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు.
SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే…
Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్‌చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్…
పాలస్తీనా అనుకూల మద్దతుదారులు గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ పైకప్పు పైకి ఎక్కారు. ముదురు దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఆస్ట్రేలియా పార్లమెంటు పైకప్పుపైకి ఎక్కి బ్యానర్‌లు కట్టారు. బ్యానర్లలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు ఉన్నాయి.
PM Modi Security Breach: ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరారు.
Parliament Terror Attack: పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడిలో జరిగిన నేటికి 22వ వార్సికోత్సవం. ఈ ఘటన జరిగిన ఇదే రోజు మరోసారి భారత పార్లమెంట్‌పై మరోసారి దాడి జరిగింది. బుధవారం ఇద్దరు అగంతకులు పార్లమెంట్ లోపలకి ప్రవేశించి, ఎల్లో స్మోక్ బాంబులను విసిరారు. ఈ ఘటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. 2001లో పార్లమెంట్‌పై పాకిస్తాన్ ఆధారిత ఉగ్రసంస్థలు లష్కరేతోయిబా, జైషే మహ్మద్ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. ఐదుగురు…
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం దావణగేరేలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా ఓ వ్యక్తి ప్రధాని కాన్వాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక హుబ్బళ్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. మోదీకి దగ్గరగా వెళ్లాలనుకున్న వ్యక్తని…
ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపపడింది. శనివారం కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది.
వినాయక నిమజ్జనం సందర్భంగా మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని బిస్వా శర్మ అన్నారు. వేదికపైకి వచ్చిన టీఆర్ఎస్ నాయకుడు.. తనకు చాలా దగ్గరగా వచ్చాడని… తన ప్రసంగాన్ని అడ్డుకోవాలనిచూశాడని.. అయితే, అప్పటికింకా తాను మాట్లాడలేదని అన్నారు. ఆ సమయంలో.. ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు హిమంత. టీఆర్ఎస్ నేత…