Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- పాలకులే హంతకులుగా మారారు
- బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- అభిషేక్ బెనర్జీపై దాడి చేసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకులే హంతకులుగా మారారని.. బెంగాల్ బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనార్‌పూర్‌లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై ఎక్స్‌లో స్పందిస్తూ ఫైరయ్యారు. ‘‘వారు సిగ్గుపడాలి.. పాలకులు హంతకులుగా మారారు. బీజేపీకి సిగ్గుచేటు.’’ అని పేర్కొన్నారు.
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సమయంలో
సోనార్‌పూర్‌లో అభిషేక్‌పై దాడి జరిగింది. గ్రామస్తులు ఇష్టానురీతిగా దాడి చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దారుణంగా దాడి చేసినప్పటికీ… మా జాతీయ ప్రధాన కార్యదర్శి వెనకడుగు వేయలేదని.. పైగా ఆ కుటుంబానికి అండగా నిలిచారని టీఎంసీ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. మమతా బెనర్జీ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసి ప్రకటన విడుదల చేశారు.
Also Read
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
“దొంగ.. దొంగ” అంటూ బీజేపీ నినాదాలు
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం కొందరు దాడి చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నారు. పార్టీలో నంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ముట్టడించే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్‌పూర్‌లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was attacked during his visit to Sonarpur to meet the post-poll violence victims' families
He says, "It's all BJP-sponsored. Look what they have done. This is their example of democracy. It hasn't even been a month,… pic.twitter.com/UXM9dzsb4U
— ANI (@ANI) May 30, 2026
West Bengal | On the attack on the party MP Abhishek Banerjee, TMC Chairperson Mamata Banerjee tweets, "Rulers became killers- shame on you BJP." https://t.co/MIZUJSZi3y pic.twitter.com/sBQZj1qZjd
— ANI (@ANI) May 30, 2026
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!