PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- పీఓకేలో హింసాత్మకంగా మారిన నిరసనలు..
- నిరసనకారుల్ని కాల్చేసిన పాకిస్తాన్ సైన్యం..
- నిరసనకారులు ‘‘భారత్ లాంటి శత్రువులే’’ అంటూ పాక్ రక్షణ మంత్రి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో నిరసనలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎన్నికల్ని బహిష్కరించాలని కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా రావలకోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో సుమారు 40 మంది మరణించినట్లు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పేర్కొంది. గత కొంత కాలంగా పీఓకే ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పీఓకే అసెంబ్లీలో రిజర్వేషన్లను వ్యతిరేకించడంతో పాటు వనరులపై హక్కులు కల్పించాలని ఉద్యమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో నిరసన తెలుపుతున్న ప్రజల్ని భారత్‌తో సమానంగా చూస్తామని, వారిని కూడా ‘‘భారత్ లాంటి శత్రవులుగానే పరిగణిస్తాం’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. పీఓకేలో ఉద్యమించే ప్రజలు తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులే అని, ఇప్పుడు వారే తమపై తిరగబడుతున్నారని ఆరోపించారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని మరోసారి బహిరంగంగా ఒప్పుకున్నట్లైంది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
పీఓకే కూడా జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమే అని భారత్ చాలా సందర్భాల్లో చెప్పింది. పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో చేస్తున్న మానవహక్కుల ఉల్లంఘనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పీఓకేలో నిర్వహించే ఎన్నికలు, పరిపాలన మార్పులు వాస్తవ పరిస్థితిని మార్చలేవని భారత్ చెప్పింది. మరోవైపు, పాక్ ఈ నిరసనల్ని అణచివేసేందుకు ఇంటర్నెట్ నిలిపేయడంతో పాటు ఆహార పదార్థాల సరఫరా, ఔషధాలను అడ్డుకుంటుదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!